Reading Time: < 1 minute

‘శకపురుషుడు, తారకరామం, నాగలాదేవి, మీర్జాపురం రాణి కృష్ణవేణి లాంటి పరిశోధనాత్మక గ్రంథాలను రచించిన భగీరథ డాక్టరేటుకు అర్హుడు, నేను యూనివర్సిటీలో ఉంటే డాక్టరేట్ ఇప్పించేవాడిని’ అని తెలుగు సినిమా రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ భగీరథ రచించిన ‘మీర్జాపురం రాణి కృష్ణవేణి‘ పుస్తక పరిచయ కార్యక్రమం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ భగీరథ, రోజా రమణి, బి. గోపాల్, వీరశంకర్, మాగంటి మురళి మోహన్, కె.ఎస్. రామారావు, కైకాల నాగేశ్వర రావు, కె. అశోకుమార్, రాశీ మూవీస్ నరసింహా రావు, డి.వి.కె రాజు, అట్లూరి నాగేశ్వరరావు, అక్కినేని నాగ సుశీల, కాజా సూర్యనారాయణ, తుమ్మల రంగారావు, సారిపల్లి కొండలరావు, శ్రీమతి విజయలక్ష్మి పండిట్, బిక్కి కృష్ణ, రామ లక్ష్మి, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు.