
ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఉప్పల్‌లో బస్సు ప్రమాదం జరిగింది. ఉప్పల్ బస్టాండ్ సమీపంలో ద్విచక్రవాహనదారుడి పైనుంచి ఆర్ టిసి బస్సు వెళ్లడంతో అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దీంతో ఉప్పల్ బస్టాండ్ నుంచి రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. చెంగిచెర్ల డిపోకు చెందిన బస్సుగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.