
మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసి పార్టీల అభ్యర్థులెవరో తేలిపోయింది. దాంతో ప్రధాన పార్టీ ల అభ్యర్థుల ప్రచారంపై దృష్టి సారించారు. ప్రధాన పార్టీలతో పాటు అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నా రు. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, ఈ నెల 9వ తేదీన ప్రచారం ముగియనుంది. ప్రచారానికి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో సాంకేతికతను వినియోగి స్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ఆ కట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గతంతో పోలి స్తే ఈసారి నిర్వహించే ఎన్నికల ప్రచారం నూతన ఒరవడులను అందిపుచ్చుకుంటుంది. రాజకీయ పార్టీలు అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కుస్తున్నాయి. ప్రత్యర్థులను డామినేట్ చేసేందుకు నాయకులు
సోషల్ మీడియాను ప్రచార అస్త్రంగా మలుచుకుంటున్నారు. నిత్యం ప్రజల తో మమేకం అయ్యేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ వేదికగా కొత్త ప్యాకేజీలకు తెరలేపారు. ఖ ర్చు తక్కువ, ప్రచారం ఎక్కువ కావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్‌ఫోన్ ఉండటం సర్వసాధారణమైపోయింది. లేచింది మొదలు పడుకునే వరకు ఫోన్ చూసే వారు లక్షల్లో ఉండడంతో నాయకులు ప్రచారానికి ఇదే సరైన మార్గమని అనుకుంటున్నా రు. చేసిన పనిని.. చేయబోయే పనులను.. తమ ప్ర చార కార్యక్రమాలను పాటలు, సాంస్కృతిక కార్యక్రమాల పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకెళుతున్నారు.ప్రచార శైలి భిన్నంగా ఉండేలా అనుభవజ్ఞులతో స్క్రిప్ట్ రాయించుకుని అందుకు అనుగుణంగా వీడియోలు రూపొంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్ గ్రూపులు, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌ను వేదికగా చేసుకుని పరస్పర ఆరోపణలతో సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. అధికార పార్టీ అభివృద్ధి పనుల ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తుండగా, ప్రతిపక్ష పార్టీలు ఆయా పనులు కాగితాలకే పరిమితమయ్యాయని ఆరోపణలు చేస్తున్నాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు
మున్సిపల్ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారాయి. ఇటీవల నగర, పురపాలికలకు నిధులొచ్చాయని, వాటితో మౌలిక వసతులు కల్పిస్తున్నామని డివిజన్లు, వార్డుల్లో అభ్యర్థులు వివరిస్తున్నారు. గెలిపిస్తే అభివృద్ధి మరింత పుంజుకుంటుందని హామీ ఇస్తున్నారు. 6 గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బిఆర్‌ఎస్ ప్రచారం ఎక్కుపెడుతోంది. గత పాలనలో చేసిన అభివృద్ధిని చెబుతూ ప్రజల ఆదరణతో గెలవాలని బిఆర్‌ఎస్ పార్టీ చూస్తోంది. ఇప్పుడు నిరుద్యోగం ప్రబలిందని, ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని చెబుతున్నారు. మున్సిపల్ ఛైర్మన్, నగర మేయర్ పీఠాలే లక్ష్యంగా నేతలు వ్యూహ్యాలు రచిస్తున్నారు. నగరాలు, పట్టణాలకు 16వ ఆర్థిక సంఘం నిధులను కేంద్రమే విడుదల చేస్తోందని బిజెపి పార్టీ ఓటర్లకు వివరిస్తోంది. అమృత్, రూర్బన్‌తో పాటు ఇతర సంక్షేమ పథకాలతో కలిగే ప్రయోజనాలను నేతలు ప్రస్తావిస్తున్నారు. నేతల ఇంటింటి ప్రచారాలతో పాటు పార్టీలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినియోగిస్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతూనే ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. కాగా, క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికల బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, బిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్‌లకు అప్పగించాయి. బిజెపి పార్టీ ఇంఛార్జ్‌లను నియమించడంతోపాటు ముఖ్యనేతలు ఆయా మున్సిపాలిటీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా రాజకీయ పార్టీల వ్యూహాల ప్రకారమే నడవాలని శ్రేణులకు నేతలు సూచిస్తున్నారు.