Reading Time: < 1 minute

మన తెలంగాణ/ ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో కరీంనగర్ కు రూ.1400 కోట్లు ఇచ్చానంటూ ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి పచ్చి అబద్దాలాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గురువారం కరీంనగర్ పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ సీ ఎంకు నిజంగా దమ్ముంటే ఆ నిధులు ఎప్పుడు ఇచ్చారు? ఏయే అభివృ ద్ధి పనులకు ఖర్చు చేశారు? అనే వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నన్ను కోసినా నయాపైసా లేదు’అని పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డికి నిధులు ఎక్కడి నుండి వచ్చాయనిప్రశ్నిం చారు. అవినీతి కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని కేంద్రాన్ని నిందించడం విచిత్రంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డిగారు.. మీలో రోశం, పౌరుషం చచ్చిపోయిందా? కేసీఆర్ పంపే మూటలతోనే ఢిల్లీకి పంపి సీఎం సీటును కాపాడుకుంటున్నారా? అందుకే ఆ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నానని ఒప్పుకుంటే చెప్పండి… కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం.

మా భుజం మీద తుపాకీ పెట్టి ఇతరులను కాలుద్దామంటే… ఆ ట్రాప్‌లో ఇరుక్కోవడానికి మేం సిద్ధంగా లేం అన్నారు. కరీంనగర్, వరంగల్ పట్టణాలను జంటనగరాలుగా మార్చి డంపింగ్ యార్డ్‌ను తరలిస్తానని సీఎం చెప్పడం పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. డంపింగ్ యార్డు తరలింపు కోసం కేంద్రం నుండి రూ.50 కోట్లు మంజూరు చేయించడంతోపాటు చెత్త బయో మైనింగ్ కోసం మరో రూ.18 కోట్లు విడుదల చేసినా… ప్రత్యామ్నాయ స్థలం చూపకుండా కాంగ్రెస్ ప్రభుత్వమే అడ్డుకుంటోందని ఆరోపించారు. కరీంనగర్ కార్పొరేషన్ అబ్ధివృద్ధికి రూ.1500 కోట్లు తెచ్చిన. ఏయే పనులు చేశానో వివరాలతో సహా బుక్ లెట్ ప్రింట్ చేయించి ఇంటింటికీ పంపుతున్నా. మొన్నటికి మొన్న నీళ్ల కోసం రూ.134 కోట్లు తెచ్చిన. ఇదిగాకుండా కార్పొరేషన్ కు మరో రూ.50 కోట్లు తెచ్చానని అన్నారు. ఇయాళ రేవంత్ రెడ్డి వస్తే, ఎల్లుండి ఆయన అన్న అసదుద్దీన్ ఒవైసీ వస్తున్నడు. ఇద్దరూ మాట్లాడుకునే వస్తున్నరు. నేను అభివృద్ధి పేరుతో ఎన్నికల్లోకి వస్తున్నా. వాళ్లు మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలనుకుంటున్నరు. పొరపాటున మీరు కాంగ్రెస్ కు ఓట్లేస్తే అభివృద్ధి ఆగిపోతుంది. అవినీతి కేసుల్లో కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని రేవంత్ రెడ్డి మమ్ముల్ని అడగడం ఆశ్చర్యంగా ఉందన్నారు.