
టిటిడి కల్యాణ మండపంలో మేడారం సమ్మక్క-సారక్క వనదేవతల హుండీ లెక్కింపు ప్రక్రియను మంత్రి కొండా సురేఖ అధికారికంగా ప్రారంభించారు. మంత్రి సురేఖ మాట్లాడుతూ, మేడారం జాతరకు దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు సమర్పించిన కానుకలను పూర్తిస్థాయి భద్రతా చర్యలు, పారదర్శక విధానాలతో లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలో, సంబంధిత అధికారుల సమక్షంలో నిబంధనల ప్రకారం నిర్వహించబడుతుందని స్పష్టం చేశారు.భక్తుల విశ్వాసానికి ఎలాంటి లోటు లేకుండా, ప్రతి రూపాయి జాగ్రత్తగా లెక్కించి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మేడారం సమ్మక్క-సారక్క వనదేవతల ఆశీస్సులతో జాతరను విజయవంతంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.