Reading Time: < 1 minute

ఢాకా: భారత్‌తో సంబంంధాలు పూర్తిగా దెబ్బతినడంపై బంగ్లాదేశ్ విదేశాంగ సలహాదారుడు తౌహీద్ హోస్సెన్ గురువారం స్పందించారు. తమ దేశ ప్రస్తుత పాలకుడు ముహమ్మద్ యూనస్ హయాంలో ఈ పరిస్థితి ఏర్పడిందని అంగీకరించారు. ప్రస్తుతానికి ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇదే విధంగా ఉంటాయి. వచ్చే వారం ఎన్నికల తరువాత ఎన్నికైన ప్రభుత్వం వస్తే, తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్నారు.

భారత్ సంబంధాలు క్షీణించాయని.. అయితే రెండు దేశాలకూ కూడా సరైన సంబంధాలు అత్యవసరం అన్నారు. ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ దౌత్యవేత్త, గతంలో భారత్‌లో ఉప ఉన్నత దౌత్యాధికారిగా పనిచేసిన అనుభవం హోస్సేన్‌కు ఉంది. ఇరుదేశాల మధ్య సజావైన సంబంధాలు ఉంటేనే బాగుంటుందని, త్వరలో ఉంటాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.