
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) 2026 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించింది. వడోదర వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 203 పరుగుల చేసింది. ఓపెనర్లు లీ(37, 30 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సులు), షఫాలీ వర్మ(20, 13 బంతుల్లో మూడు ఫోర్లు)లతో రాణించగా.. కెప్టెన్ జెమీమా(57) అర్ధ శతకంతో అలరించింది. ఇక, చివర్లో వోల్వార్ట్(44, 25 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సులు), హెన్రీ(35, 15 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సులు) ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగారు. దీంతో ఢిల్లీ, ఆర్సీబి జట్టుకు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.