Reading Time: < 1 minute

హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలు హైకోర్టు డివిజన్ బెంచ్ సక్రమమేనని తెలిపింది. గ్రూప్-1పరీక్షలపై తెలంగాణ విచారణ జరిపింది. గ్రూప్-1 పరీక్ష పారదర్శకంగానే జరగడంతో పాటు కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. గ్రూప్1 పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని చెప్పడంతో పాటు నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును, గ్రూప్-1 జనరల్ ర్యాకింగ్ లిస్టును రద్దు చేసింది. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని సింగిల్ జడ్జి ఆదేశాలపై టిజిపిఎస్సి, ఎంపికైన అభ్యర్థుల అప్పీలుపై ధర్మాసనం తీర్పు నిచ్చింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టవచ్చని గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 562 మందికి ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చింది.