Reading Time: < 1 minute

ఇస్లామాబాద్: టి20 ప్రపంచ కప్‌లో టీమిండియాతో తమ జట్టు ఆడబోదని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ తెలిపారు. ఇస్లామాబాద్ మంత్రివర్గంతో సమావేశం అనంతరం ఆయన ప్రసంగించారు. టి20 వరల్డ్ కప్‌లో భారత్‌తో పాకిస్థాన్ జట్టు ఆడబోమని స్పష్టం చేశారు. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడాదు కానీ తాము సరైన నిర్ణయం తీసుకున్నామన్నారు. పాక్ నిర్ణయంపై గతంలో ఐసిసి తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ నెల 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో పాక్ ఆడాల్సి ఉంది. 

టోర్నమెంట్ లో ఎంపిక చేసిన మ్యాచ్ ల్లో మాత్రమే ఆడుతామనడం, భారత్ తో ఆడబోమనడం మంచిది కాదని ఐసిసి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు పాక్ నిర్ణయం షాక్ కలిగించిందని, ఈ మ్యాచ్ ఆ దేశపు క్రికెట్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఐసిసి హెచ్చరించింది. రెండు దేశాల మధ్య వివాదాలను క్రీడల్లోకి తీసుకరావడం మంచిది కాదని హితువు పలికింది. ప్రపంచ క్రికెట్ లోనే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ బలే క్రేజ్ ఉంటుంది. గత 14 సంవత్సరాల ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా సిరీస్ లు లేనప్పటికి ఐసిసి, ప్రధాన టోర్నమెంట్లలో తలపడుతున్నప్పుడు ఉద్వేగం కనిపిస్తుందన్నారు. ఒకవేళ పాక్ మ్యాచ్ ను బహిష్కరిస్తే 2010 తరువాత రెండు దేశాల మధ్య జరగని మ్యాచ్ గా నిలిచిపోతుంది. భారత్ లో భద్రత పరంగా ఆ దేశంలో ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. దీంతో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ నుంచి తప్పించి స్కాట్ లాంట్ ను  ఐసిసి ఎంపిక చేసింది. బంగ్లాదేశ్ కు మద్దతుగా భారత్ తో తాము ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. టీమిండియాతో పాక్ మ్యాచ్ ఆడకోవడం వల్ల దాదాపు రూ.4.500 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.