Reading Time: < 1 minute

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భూవివాదం జరిగింది. సన్ సిటి వద్ద ఓ ప్రైవేట్ స్థలంలో నిర్మించిన ప్రహారి గోడను జెసిబితో దుండగులు కూల్చి వేశారు. దౌర్జన్యంగా ప్రైవేట్ స్థలం లోకి ప్రవేశించిన 100 మంది హంగామా సృష్టించారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన స్థల యజమాని, దుండగులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో యజమాని రవి యాదవ్ ఫిర్యాదు చేశారు. 

1935వ సంవత్సరం లో హైదర్ షాకోట్ లోని  సర్వే నెంబర్ 16,17,18,19 లో ఉన్న 39.24 ఎకరాలను యాదవ్ కుటుంబీకులు కొనుగోలు చేశారు. 39 ఎకరాల వ్యవసాయ పొలాన్ని యజమాని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.అందులో 21 ఎకరాల పొలాన్ని 1971 సంవత్సరం లో ఇండియన్ ఆర్మికి యాజమాని ఇచ్చారు. సర్వే నెంబర్ 18/4 లో ఉన్న 33 గుంటల స్థలం గురించి ఇప్పుడు వివాదం నెలకొంది. కొంత మంది ఆ స్థలం తమదంటూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఫెక్ డాక్యుమెంట్లు సృష్టించి జెసిబిలతో దుండగులు రెచ్చిపోయారు. భూములకు రెక్కలు రావడంతో పాటు ఖరీదైన భూములపై కబ్జాదారులు కన్నేశారు. ఈ భూమి మాదంటే మాదంటూ గొడవ జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో అసలు యజమాని ఫిర్యాదు చేశాడు. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికి దౌర్జన్యం చేయడం మంచిది కాదంటూ న్యాయం చేయాలంటూ యజమాని వాపొయారు.