పలకరింపు
Reading Time: < 1 minuteతనని కలిసినప్పుడు ఇప్పటి బరువు, నెరవు గమనించి మునుపటి గుర్తుతో పోల్చుకొని నడకలో తొణుకుతున్న నలతని శ్వాసలోని సందిగ్ధాన్ని నవ్వులోని వైరాగ్యాన్ని భుజాల వొంపులోని నైరాశ్యాన్ని వీటన్నిటి కొలత తీసుకుంటేనే నువ్వు తనని ప్రత్యక్షంగా పలకరించినట్టు…