Reading Time: < 1 minute
High Voter Turnout In Assam Kerala And Puducherry Assembly Elections Polling Percentages Surge

Assembly Election Voting: దేశంలోని 3 రాష్ట్రాల్లో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. అస్సాం, కేరళం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఓటర్లు పెద్దఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగిస్తున్నారు. అస్సాంలో 126 స్థానాలు, కేరళలో 140 స్థానాలు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు నేడు ఎన్నికలు జరిగాయి. అస్సాం రాష్ట్రంలో సాయంత్రం 5 గంటల వరకు 84.42% పోలింగ్ నమోదైంది. ఇందులో సౌత్ సాల్మారా-మాంకచార్ జిల్లాలో అత్యధికంగా 94.08 శాతం ఓటింగ్ నమోదు అయ్యింది.

Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!

ఇక కేరళంలో సాయంత్రం 5 గంటల వరకు 75.01% పోలింగ్ నమోదైంది. కోజికోడ్ జిల్లాలో అత్యధికంగా 77.63% ఓటింగ్ నమోదైంది. ఇక పుదుచ్చేరిలో కూడా పోలింగ్ శాతం గణనీయంగా నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు 86.92% ఓటింగ్ నమోదైంది. ఇదిలా ఉండగా కర్ణాటకలోని బగల్‌కోట్ ఉపఎన్నికలో 65.68%, దావణగెరే సౌత్‌లో 63.04% పోలింగ్ నమోదైంది. అలాగే నాగాలాండ్‌లోని కొరిడాంగ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో 5 గంటల వరకు 80.62% ఓటింగ్ నమోదైంది. త్రిపురలోని ధర్మనగర్ నియోజకవర్గంలో 79.84% ఓటింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ పోలింగ్‌కు నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి రోజు కాగా, రెండో దశ పోలింగ్‌కు నామినేషన్ల దాఖలుకు కూడా ఇదే చివరి రోజు.

Bhatti Vikramarka :జూన్ 2 నుంచి విద్యార్థులకు అల్పాహార పథకం