చర్మాన్ని శుభ్రం చేసుకోవడం: చర్మ సంరక్షణలో మొదటి అంశం ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం. చాలా మంది దీన్నే విస్మరిస్తూ ఉంటారు. కాబట్టి రోజుకు రెండు మూడు సార్లు మంచి నీటితో ముఖాన్ని కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డు తొలగిపోతుంది. చర్మం మరీ జిడ్డుగా ఉంటే సహజసిద్ధమైన పద్ధతుల్లో ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా చర్మంపై ఉన్న మలినాలు తొలగిపోయి చర్మం సహజంగా మెరుస్తుంది.
కలబంద : ముఖ సౌందర్యానికి కలబంద ఒక అద్భుతమైన ఔషధం. ఇందులో ఉండే విటమిన్-E, యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించి, వయసు తక్కువగా కనిపించేలా చేస్తాయి. కలబంద జెల్‌ను ముఖానికి రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది అలాగే చర్మ రంగు కూడా మెరుగుపడుతుంది.
ఆయిల్ మసాజ్ :చర్మం మెరవడానికి ఆయిల్ మసాజ్ ఉత్తమ మార్గం. స్వచ్ఛమైన కొబ్బరి నూనెను గోరువెచ్చగా చేసి రోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి మసాజ్ చేయాలి. ఉదయం కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా రక్త ప్రసరణను పెంచి, ముడతలను తొలగిస్తుంది.
న్యాచురల్ ఫేస్ ప్యాక్‌లు: మెరిసే చర్మం కోసం జనాలు బయటదొరికే ఖరీదైన ఫేస్ ప్యాక్‌లు వాడుతూ ఉంటారు. కానీ ఇంట్లో బియ్యం పిండింతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. బియ్యప్పిండిలో కొంచెం పసుపు, పెరుగు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసి కాసేపు మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
సన్‌స్క్రీన్ వాడకం: చాలా మంది సమ్మర్లో సన్‌స్క్రీన్ రాసుకోకుండానే బయటకు వెళ్తారు. దీని వల్ల ముఖం నల్లగా మారుతుంది. కాబట్టి ముఖం కడిగిన తర్వాత సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోకూడదు. కేవలం బయటకు వెళ్ళినప్పుడే కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ వాడటం అలవాటు చేసుకోవాలి. బయటకు వెళ్లే కనీసం 30 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల చర్మం ఎండ దెబ్బ నుంచి రక్షించబడుతుంది. ఈ సింపుల్ ఆయుర్వేద చిట్కాలను పాటించడం ద్వారా ఎటువంటి హాని లేకుండా సహజంగా మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.( Note: పైర పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడినవి.. వీటిని Tv9 దీవీకరించడం లేదు)




