
పార్థ గోపాల్ హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘డైమండ్ డెకాయిట్’. మేఘన హీరోయిన్. సూర్య జి యాదవ్ దర్శకుడు. ఏప్రిల్ 10న సినిమా విడుదల కానుంది. గురువారం ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పార్థ గోపాల్ మాట్లాడుతూ ‘ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కడపలో చిత్రీకరించిన అందమైన లొకేషన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహిళలకు 4 షోలు ఉచితంగా ఏర్పాటు చేశాం. అందరూ థియేటర్లకు వచ్చి సినిమా చూడాలి’ అని అన్నాడు. దర్శకుడు సూర్య జి. యాదవ్ మాట్లాడుతూ ‘33 ఏళ్ల క్రితం వచ్చిన ‘మాతృదేవోభవ’ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఎంతగా కదిలించిందో మనందరికీ తెలిసిందే. ఆ తరహా భావోద్వేగాన్ని మళ్లీ ఈ తరం ప్రేక్షకులకు అందించాలనే ప్రయత్నమే ఈ చిత్రం’ అని చెప్పాడు.