Reading Time: < 1 minute

అమరావతి: కుంభమేళా మోనాలిసా ప్రేమ వివాహంలో ట్విస్ట్ నెలకొంది. కుంభమేళాలో వైరల్ అయిన అమ్మాయి మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇటీవల ఫార్మాన్ ఖాన్ అనే వ్యక్తి మోనాలిసాను పెళ్లి చేసుకున్నాడు.  అయితే పెళ్లి నాటికి మోనాలిసా వయసు 16 ఏళ్లు అని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ గుర్తించింది. దీంతో ఆమె భర్తపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహేశ్వర్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.