
ఉప్పెన’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన అందాల తార కృతి శెట్టి కొంత కాలం తర్వాత ఇప్పుడు తెలుగులో ఓ క్రేజీ మూవీలో నటించనుంది. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాలో ఆమె ఓ హీరోయిన్‌గా చేయనుంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కృతిశెట్టి… నందమూరి కళ్యాణ్ రామ్‌కు జోడీగా నటించనుంది. ఈ నేపథ్యంలో కృతిశెట్టి మాట్లాడుతూ “తెలుగులో గ్యాప్ అనేది నిజంగా అయితే నేను ప్లాన్ చేసింది కాదు. వరుసగా తమిళ్ నుంచి అవకాశాలు వచ్చాయి. అందులో నాకు చాలా కథలు నచ్చాయి. తెలుగు ఆడియన్స్ నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటారు. వాళ్లకు ఒక మంచి సినిమా ఇవ్వాలి అనుకుని ఈ సమయం తీసుకున్నాను. ఈ గ్యాప్‌లో మళ్లీ యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లాను. ఫైటింగ్స్ ఎలా చేయాలో నేర్చుకున్నాను.
అలాగే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నాను. సమయం దొరికితే నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం తెలుగులో అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయబోతున్నాను. అలాగే తమిళ్‌లో ఒక సినిమా చర్చల్లో ఉంది”అని అన్నారు. ఇక తాజాగా అనిల్ రావిపూడి తన సినిమాలో హీరోయిన్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. తన మూవీలో నందమూరి హీరోకి జోడిగా కృతి శెట్టి నటిస్తున్నట్లు ఆయన అధికారికంగా చెప్పారు. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ మూవీలో విక్టరీ వెంకటేష్‌కి జోడీగా ఏ భామ నటించబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో, సినిమా లవర్స్‌లో అంచనాలు భారీగా ఉన్నాయి. అనిల్ రావిపూడి సినిమా అంటే సంక్రాంతికి రావాల్సిందే అనే ట్రెండ్ మార్క్ సెట్ చేసిన ఈ సక్సెస్‌పుల్ డైరెక్టర్.. ఇప్పుడు తన కొత్త సినిమాను కూడా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రాజెక్ట్ చుట్టూ ఉన్న భారీ అంచనాలను తగ్గట్టుగా దర్శకుడు స్క్రిప్ట్‌ను జాగ్రత్తగా మెరుగుపరుస్తున్నాడు.