Reading Time: < 1 minute

మహబూబ్ నగర్: ఏదుల రిజర్వాయర్ కోసం భూమి ఇవ్వాలని రైతులకు కాళ్లు మొక్కుతానని విజ్ఞప్తి చేశానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు – రంగారెడ్డిలో భాగమైన ఏదుల రిజర్వాయర్ భూసేకరణ కోసం తానొక్కడినే 73 సార్లు రైతులను కలిశానని గుర్తు చేశారు.  ప్రతిసారి వెళ్ళి ఓపికతో కూర్చొని అంశాన్ని బోధించి రైతులకు నచ్చజెప్పానని, ఒక్కో సందర్భంలో రాత్రి పది గంటలు అయ్యేదనని తెలియజేశారు. వలసపోయిన పాలమూరుకు నీళ్ళు వస్తే బాగు పడుద్దని, రైతులను విజ్ఞప్తి చేసి కాళ్లు మొక్కుతానని విజ్ఞప్తి చేసి భూసేకరణ చేయించానని, అంత ఓపికగా కూర్చుంటే రైతులు భూములు ఇచ్చారని చెప్పారు. అది వదిలేసి తాను భూములు తీసుకుంటా రైతులు ఏంత?.. వాళ్ళు కూర్చొని ఏం చేస్తారు అంటే మేఘా రెడ్డి కాదు ఆయన తాత వచ్చినా రైతుల భూములు తీసుకొని ప్రాజెక్ట్ కట్టలేడన్నారు. లగచర్లలో భూములు తీసుకుంటే రేవంత్ రెడ్డికి అక్కడి రైతులు లాగులు తడిచేటట్లు చేశారని దుయ్యబట్టారు.