Reading Time: 2 minutes
Rashid Khan May Quit Test Cricket Due To Back Injury Doctors Warn Of Career Risk

Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్ ఆడటం తనకు కష్టంగా మారిందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ముఖ్యంగా వైద్యుల సూచనల కారణంగా రెడ్ బాల్ ఫార్మాట్‌కు దూరంగా ఉండాలని చెప్పినప్పటికీ.. తాను జట్టుకోసం ఆడానని తెలిపారు. అయితే అదే కొనసాగితే తన కెరీర్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని డాక్టర్లు హెచ్చరించినట్లు తెలిపాడు.

Dacoit: రేపే థియేటర్స్‌లోకి డెకాయిట్.. అప్పుడే గూఢచారి 2 పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన శేష్!

2023 నుంచి లోయర్ బ్యాక్ నొప్పితో బాధపడుతున్న రషీద్, శస్త్రచికిత్స అనంతరం కూడా ఆటకు దూరం కాలేదు. జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా 67 ఓవర్లు బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. అయితే ఇది తన శారీరక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారని పేర్కొన్నాడు. “రెడ్ బాల్ క్రికెట్ నుంచి దూరంగా ఉండాలని డాక్టర్లు మొదటే చెప్పారు. అయినప్పటికీ నేను ఆడాను. కానీ ఈ ఫార్మాట్ కొనసాగితే కెరీర్ ఎక్కువ కాలం ఉండదని చెప్పారు” అని రషీద్ తెలిపాడు.

తాజాగా టెస్ట్ క్రికెట్‌లో తన భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నానని రషీద్ తెలిపాడు. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్‌లలో అధిక ఓవర్లు వేయాల్సి రావడం వల్ల శరీరంపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పాడు. గత రెండు టెస్ట్ మ్యాచ్‌ లలో కలిపి 126 ఓవర్లు బౌలింగ్ చేయడం చాలా ఎక్కువగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇక వన్డే ఫార్మాట్‌ పై తనకు ప్రత్యేక ఆసక్తి ఉందని, ఆ ఫార్మాట్‌ లో ఎక్కువ కాలం ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపాడు.

Botsa Satyanarayana Emotional: ఆ మహానేతను తలుచుకొని కంటతడి పెట్టిన బొత్స..!

అఫ్గానిస్తాన్ జట్టుకు సేవలు అందిస్తూ ప్రపంచకప్ వంటి ప్రధాన టోర్నమెంట్లకు సిద్ధమవ్వాలని భావిస్తున్నాడు. తన ఫిట్‌నెస్‌ ను కాపాడుకునేందుకు వర్క్‌లోడ్‌ ను జాగ్రత్తగా నిర్వహించనున్నట్లు తెలిపాడు. 2017లో టెస్ట్ హోదా పొందిన తర్వాత అఫ్గానిస్తాన్ ఇప్పటివరకు 12 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. అందులో రషీద్ ఖాన్ కేవలం ఆరు మ్యాచ్‌ లలోనే ఆడినా, 45 వికెట్లు తీసి మూడు సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. మొత్తానికి గాయాల సమస్యల దృష్ట్యా రషీద్ ఖాన్ టెస్ట్ క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టు భవిష్యత్తు, తన కెరీర్ దీర్ఘకాలికతను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకోనున్నాడు.