Reading Time: 2 minutes

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ మలేషియాలో హానర్ X5d ప్లస్, హానర్ X5d అనే రెండు కొత్త ఫోన్‌లను విడుదల చేసింది. ఈ రెండు పరికరాలు బడ్జెట్ శ్రేణికి చెందినవి. డిజైన్, కొలతలు, రంగుల ఎంపికల పరంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లు ఒకేలా ఉంటాయి. హానర్ X5d సిరీస్ ప్రస్తుతం దేశంలో కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు రెండు రంగుల ఎంపికలు, ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో విడుదలయ్యాయి. అంతేకాకుండా..ఈ రెండు ఫోన్‌లు ఒకే మీడియాటెక్ హీలియో చిప్‌సెట్, 5,260mAh బ్యాటరీతో పనిచేస్తాయి. హానర్ X5d సిరీస్‌లో డ్యూయల్ రియర్ కెమెరాలు కూడా ఉన్నాయి.

హానర్ X5d సిరీస్ ధర, లభ్యత

ఈ స్మార్ట్ ఫోన్ల ధరల విషయానికొస్తే..4GB + 128GB వేరియంట్ కోసం హానర్ X5d ప్లస్ ధర MYR 459 (సుమారుగా రూ.11,000). మరోవైపు.. స్టాండర్డ్ హానర్ X5d 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర MYR 369 (సుమారు రూ.9,000)గా ఉంది. ఈ రెండు పరికరాలు ప్రస్తుతం మలేషియాలో హానర్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. హానర్ X5d ప్లస్, హానర్ X5d మిడ్‌నైట్ బ్లాక్, టైడల్ బ్లూ రంగులలో లభిస్తాయి.

హానర్ X5d సిరీస్ ఫీచర్లు

ఫీచర్ల పరంగా..ఈ హ్యాండ్‌సెట్‌లలో 6.74-అంగుళాల TFT LCD టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇవి ఐ కంఫర్ట్, డైనమిక్ డిమ్మింగ్‌కు కూడా మద్దతు ఇస్తాయి. ఈ పరికరానికి ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G81 చిప్‌సెట్ శక్తిని అందిస్తుంది. ఈ పరికరంలో ARM మాలి G52 MC2 GPU, 4GB RAM కూడా ఉన్నాయి. హానర్ X5dలో 64GB స్టోరేజ్ ఉండగా, ప్లస్ మోడల్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ రెండు పరికరాలు ఆండ్రాయిడ్ 15 ఆధారిత మ్యాజిక్‌ఓఎస్ 9.0 పై పనిచేస్తాయి.

కెమెరా విషయానికి వస్తే..హానర్ X5d ఫోన్‌లో 0.08-మెగాపిక్సెల్ QVGA కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. హానర్ X5d ప్లస్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. స్టాండర్డ్ మోడల్‌లో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఈ రెండు డివైజ్‌లలో 5,260mAh బ్యాటరీ కూడా ఉంది. ఇవి 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.