Reading Time: 2 minutes
Sunetra Pawar Unopposed Win Baramati Bypoll Congress Withdraws

Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలో పవార్ కుటుంబం తన పట్టును మరోసారి నిలబెట్టుకుంది. రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నాయకుడు, మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణం తర్వాత ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి బారామతి సీటు పవార్ కుటుంబానికి కంచుకోటగా చెబుతుంటారు. అజిత్ పవార్ ఇక్కడి నుంచి వరుసగా ఎనిమిది సార్లు విజయాన్ని సాధించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన, తన మేనల్లుడు యోగేంద్ర పవార్‌తో సహా 24 మంది అభ్యర్థులపై పోటీ చేసి 1,81,000 ఓట్లకు పైగా భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.

READ ALSO: Jeevan Reddy : KCR పాలన బెటర్ అనే భావనతోనే BRSలో చేరుతున్నా..

రాజకీయంగా కీలకమైన బారామతి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఒక పెద్ద అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థి ఆకాష్ విశ్వనాథ్ మోరేను ఆ స్థానం నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్ ఈ స్థానం నుంచి దాదాపు ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయమైనట్లు కనిపిస్తుంది. ఇప్పటి వరకు బారామతి నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్థులు వారి నామినేషన్స్ ఉపసంహరించుకున్నారు. బారామతి ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తరుఫున న్యాయవాది ఆకాష్ మోరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్‌ను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించగా, ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఏప్రిల్ 5, 2026న దీనిని లాంఛనంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ వ్యూహాత్మకంగా ఈ ఉప ఎన్నికల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. నిజానికి అజిత్ పవార్ మృతి నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో నియోజకవర్గంలో సునేత్ర పవార్‌పై సానుభూతి స్పష్టంగా కనిపిస్తోంది.

మొదట్లో సునేత్రా పవార్ ఏకగ్రీవంగా గెలవాలని డిమాండ్లు వచ్చాయి, కానీ కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఈ పోటీని హై-ప్రొఫైల్‌గా మార్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ఈ పోరు నుంచి వైదొలగడంతో, వాతావరణం మరోసారి పవార్ కుటుంబానికి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. బారామతి, రాహురి అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగాల్సి ఉంది. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే బారామతి నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులందరూ వైదొలగడంతో ఇప్పుడు సునేత్ర పవార్ విజయం ఖాయంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

READ ALSO: Hezbollah Chief: ఇరాన్‌కి కోలుకోలేని షాక్.. ఇజ్రాయెల్ దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ క్లోజ్!