
TCS Salary Hike: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. 2026 ఏప్రిల్ 1 నుండి అన్ని గ్రేడ్లలోని ఉద్యోగులకు వార్షిక వేతన పెంపు (Appraisal) అమలు చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కంపెనీలో పనిచేస్తున్న అన్ని స్థాయిల ఉద్యోగులకు ఈ జీతాల పెంపు వర్తిస్తుందని.. అయితే, ఎంత శాతం పెంచుతున్నారనే ఖచ్చితమైన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.
Fire Accidnet: ప్రభాస్ సినిమా ‘స్పిరిట్’ సెట్‌లో అగ్ని ప్రమాదం..
భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా తమ ఉద్యోగులను సిద్ధం చేస్తున్నామని టీసీఎస్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సుదీప్ కున్హుమల్ తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) నైపుణ్యాలను పెంపొందించడంపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించింది. గత త్రైమాసికంలో (Q4 FY26) కంపెనీలో కొత్తగా 2,300 మంది ఉద్యోగులు చేరారు. దీనితో టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 5,84,519కి చేరుకుంది.
బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!
మార్చిలో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ లాభం 12.2% పెరిగి రూ. 13,718 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం కూడా 9.6% వృద్ధి చెంది రూ. 70,698 కోట్లుగా నమోదైంది. గత ఏడాది మధ్యస్థాయి, దిగువ స్థాయి ఉద్యోగులకు 4.5% నుండి 7% వరకు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి 10% వరకు వేతన పెంపును అందించిన సంగతి తెలిసిందే. తాజా నిర్ణయంతో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.