Reading Time: < 1 minute

జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చింది

జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు

కాంగ్రెస్‌ను విమర్శించే ముందు.. గతంలో బిఆర్‌ఎస్‌పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి

-పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ 

మనతెలంగాణ/హైదరాబాద్: జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చిందని పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాలని, జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, సిఎం రేవంత్ రెడ్డి పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరని పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బిఆర్‌ఎస్‌పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. గురువారం గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపి వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు రేపైనా కలుస్తాయన్నారు. బిజెపి ఆధ్వర్యంలో ఎవరూ బాగుపడలేదని మార్పు వచ్చింది కాబట్టి బిఆర్‌ఎస్ పోయిందని పిసిసి అధ్యక్షుడు అన్నారు.