ఓవర్లోడింగ్: తక్కువ సమయంలో ఎక్కువ బట్టలు ఉతకాలనే ఆత్రుతతో మెషీన్ సామర్థ్యానికి మించి బట్టలు లోడ్ చేయడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఉదాహరణకు.. మీ మెషీన్ సామర్థ్యం 10 కిలోలు అయితే, అంతకంటే ఎక్కువ బట్టలు వేస్తే మోటారుపై విపరీతమైన భారం పడుతుంది. దీనివల్ల మోటారు త్వరగా కాలిపోవడమే కాకుండా లోపల బట్టలు తిరగడానికి ఖాళీ లేక మురికి సరిగ్గా వదలదు.
సెట్టింగ్‌ల పట్ల నిర్లక్ష్యం: చాలామంది మెషీన్ కొన్నప్పుడు ఇచ్చే యూజర్ మాన్యువల్‌ను అస్సలు చదవరు. ప్రతి వస్త్రానికి ఒక ప్రత్యేకమైన వాషింగ్ మోడ్ ఉంటుంది. సరైన సెట్టింగ్ ఎంచుకోకపోతే బట్టలు రంగు వెలిసిపోవడం లేదా చిరిగిపోయే ప్రమాదం ఉంది. మాన్యువల్ చదవడం వల్ల మెషీన్ పనితీరును మెరుగుపరచవచ్చు.
జేబులు చెక్ చేయకపోవడం: బట్టలను మెషీన్లో వేసే ముందు జేబులను సరిచూసుకోవడం చాలా ముఖ్యం. జేబుల్లో మరిచిపోయిన నాణేలు, తాళం చెవులు, పిన్నులు వంటి వస్తువులు వాషింగ్ డ్రమ్ లేదా పైపుల్లో ఇరుక్కుపోయి మెషీన్‌కు భారీ నష్టం కలిగిస్తాయి. అలాగే కరెన్సీ నోట్లు ఉంటే అవి కూడా తడిసి పనికిరాకుండా పోతాయి.
ఎక్కువ డిటర్జెంట్.. ఎక్కువ నష్టం: బట్టలు బాగా మురికిగా ఉంటే ఎక్కువ సర్ఫ్ వేయాలని చాలామంది అనుకుంటారు. కానీ ఇది కేవలం భ్రమ మాత్రమే. అవసరానికి మించి డిటర్జెంట్ వాడితే అది నీటిలో పూర్తిగా కరగక మెషీన్ పైపుల్లో పేరుకుపోతుంది. దీనివల్ల మెషీన్ లోపల దుర్వాసన రావడం, పైపులు బ్లాక్ అవ్వడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఒక్క స్కూప్ డిటర్జెంట్‌తో కూడా బట్టలను శుభ్రంగా ఉతకవచ్చని గుర్తించండి.
మెషీన్ క్లీనింగ్ మరిచిపోవడం: బట్టలను శుభ్రం చేసే మెషీన్‌ను కూడా మనం శుభ్రం చేయాలని చాలామందికి తెలియదు. బట్టల నుండి వచ్చిన మురికి, నూలు పోగులు మెషీన్ లోపల పేరుకుపోతాయి. నెలకు ఒకసారైనా టబ్ క్లీన్ ఆప్షన్ ఉపయోగించి లేదా వెనిగర్ వంటి వాటితో మెషీన్‌ను శుభ్రం చేయకపోతే, అది బ్యాక్టీరియాకు నిలయంగా మారుతుంది.




