
ఏఐ+ నోవా 2 సిరీస్ భారత టెక్ మార్కెట్లో విడుదల అయింది. ఈ లైనప్‌లో ఏఐ+ నోవా 2 5G, ఏఐ+ నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు పరికరాలు ఐదు రంగుల ఆప్షన్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త సిరీస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర, సేల్స్ డేట్, ఫీచర్ల వివరాలను ఒక్కొక్కటిగా చూద్దాం.
ఏఐ ప్లస్ నోవా 2 5G ధర, ఫీచర్లు
మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. అయితే, కంపెనీ 6GB RAM + 128GB వేరియంట్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇక లభ్యత విషయానికి వస్తే..ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు వస్తుంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్, పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంటుంది.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే..ఈ ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. పరికరం వేగం, మల్టీటాస్కింగ్ కోసం..యూనిసోక్ T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఈ ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ పరికరం 6000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ధర, ఫీచర్లు
ఈ డివైస్ 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. కాగా, కంపెనీ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధరను వెల్లడించలేదు. లభ్యత విషయానికి వస్తే..ఈ హ్యాండ్‌సెట్ సేల్స్ ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి. ఈ పరికరాన్ని బ్లాక్, గ్రీన్, బ్లూ, పర్పుల్, రెడ్ రంగులలో కొనుగోలు చేయవచ్చు.
ఫీచర్ల విషయానికి వస్తే..అల్ట్రా మోడల్‌లో 6.78-అంగుళాల 1.5K ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఇది 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తుంది. కెమెరా పరంగా.. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX752 కెమెరా సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.