Reading Time: < 1 minute

ఇద్దరూ మైనర్లే.. ఇన్స్టాగ్రామ్ లో లైంగిక వేధింపులు..బాలిక ఆత్మహత్య..

Caption of Image.

సోషల్ మీడియా మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వాడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు కూడా విపరీతంగా సోషల్ మీడియా వాడుతున్న క్రమంలో ఇటీవల అనర్థాలు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్ లో దారుణం జరిగింది..ఇంస్టాగ్రామ్ లో తోటి విద్యార్ధి లైంగికంగా వేధించడంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో జరిగింది ఈ ఘటన. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

కుంట్లూరు లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో10 వ తరగతి చదువుతున్న రితిక, వినయ్ కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లో చాటింగ్ చేసుకునేవారు. స్నేహం ముసుగులో రితికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు వినయ్. రితిక వద్దని పలుమార్లు మందలించినా వినయ్ బుద్ధి మారలేదు. వినయ్ లైంగిక వేధింపులకు తట్టుకోలేక గురువారం ( ఏప్రిల్ 9 ) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది రితిక.

ALSO READ : నల్లగా ఉన్నాడని భర్తను చంపిన భార్య

రితిక మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సొంతూరికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్ కు రప్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రితిక మరణానికి లైంగిక వేధింపులే కారణమా, లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

©️ VIL Media Pvt Ltd.