Reading Time: < 1 minute

బాల్యం  భద్రంగా ఉంటేనే దేశ భవిష్యత్ బాగుంటుంది

Caption of Image.

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టౌన్,వెలుగు: పిల్లల బాల్యం భద్రంగా ఉంటేనే దేశ భవిష్యత్‌‌‌‌‌‌‌‌  బాగుంటుందని మాజీ మంత్రి, కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే  గంగుల  కమలాకర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక  కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళ, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో  సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మేయర్  కొలగాని  శ్రీనివాస్ తో కలిసి గంగుల కమలాకర్  అంగన్వాడీ టీచర్లకు మొబైల్స్‌‌‌‌‌‌‌‌, దివ్యాంగులకు త్రీవీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాహనాలను పంపిణీ చేశారు. చిన్నారుల  ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో సీడీపీవో సబిత, అంగన్వాడీలు, చిన్నారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.