Reading Time: < 1 minute
Viral Video: ఉద్యోగుల కష్టానికి మెచ్చి.. ఏకంగా 12 ఆడీ కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన కంపెనీ! వీడియో

చెన్నై, ఏప్రిల్ 9: సాధరణంగా ఏ కంపెనీ అయినా తమ ఉద్యోగుల పనితీరు మెరుగ్గా ఉంటే స్వీట్లు ఇస్తారు. లేదంటే బోనస్‌ ఇస్తారు. అయితే చెన్నైకి చెందిన ఈ కంపెనీ మాత్రం ఏకంగా విలాసవంతమైన ఆడీ కార్లను తమ ఉద్యోగాలకు బహుమతిగి పంపిణీ చేసింది. కోట్ల విలువైన 12 కార్లను తమ ఉద్యోగులకు గిఫ్ట్‌గా ఇవ్వడంతో ప్రతి ఒక్కరూ ఈ కంపెనీలో ఉద్యోగం కోసం తమ రెజ్యూమెలను అప్‌డేట్ చేసుకునే పనిలో పడ్డారు. వివరాల్లోకెళ్తే..

చెన్నైకి చెందిన బహుళ రంగాల సంస్థ అయిన రిఫెక్స్ గ్రూప్ తమ ఉద్యోగుల్లో 12 మందికి ఆడి A4 లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చింది. ఇంధనం, పర్యావరణం, వివిధ ఇతర రంగాలలోకి విస్తరించిన ఈ సంస్థ, తన ఉద్యోగుల కృషిని, కంపెనీ అభివృద్ధికి వారి సహకారాన్ని గౌరవించేందుకు ‘వీల్ ఆఫ్ అచీవ్‌మెంట్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. సాధారణంగా ఇటువంటి ప్రతిష్టాత్మక అవార్డులను కంపెనీలో అత్యున్నత పదవులలో ఉన్నవారికి మాత్రమే ఇస్తారు. అయితే సదరు కంపెనీ మాత్రం చాలా కాలంగా పనిచేస్తూ, కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులను కంపెనీ ఎంపిక చేసింది. తమ పదవికి మించి పనిచేసి, అంకితభావం చూపిన వారికి ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో సుమారు రూ. 47 లక్షల నుంచి రూ. 56 లక్షల (ఎక్స్-షోరూమ్) మార్కెట్ విలువ కలిగిన ఈ ఆడి A4 కార్లను ఉద్యోగులకు గిఫ్ట్‌గా ఇచ్చింది. అంతే ఎంపికైన ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఈ కార్లను స్వీకరించడానికి వచ్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Unseen Chennai (@unseenchennai)

కాగా ఓ భారతీయ కంపెనీ తన లాభాలలో కొంత భాగాన్ని నేరుగా తన ఉద్యోగుల అవసరాల కోసం ఖర్చు చేయడం అనేది చాలా అరుదుగా జరిగే సంఘటనగా చెప్పుకోవచ్చు. ‘ఉద్యోగులే మా అతిపెద్ద బలం. వారి కష్టాన్ని అభినందించి, వారిని ప్రోత్సహించడం మన కర్తవ్యం’ అని రెఫెక్స్ గ్రూప్ కంపెనీ ఉన్నతాధికారులు అంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.