Reading Time: < 1 minute

ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుని, కోల్ కతాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్ కు దూరమైన కెకెఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న కెకెఆర్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా కనిపిస్తోంది.

జట్లు:

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే (సి), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (w), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్