
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)లో కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఇది సువర్ణావకాశం. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 9,195 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మన్) పోస్టుల భర్తీకి సీఆర్పీఎఫ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దేశ రక్షణలో భాగస్వాములు కావడానికి ఈ నోటిఫికేషన్ ఒక గొప్ప వేదిక. ఏప్రిల్ 20 నుంచి మే 19 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించారు.
మొత్తం పోస్టులు: 9195.
విభాగాల వారీగా ఖాళీలు: కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్ & టెక్నికల్) 9175, కానిస్టేబుల్ (పయనీర్ వింగ్) 20.
ఎలిజిబిలిటీ
డ్రైవర్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ / పదోతరగతి + హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
మోటార్ మెకానిక్ వెహికల్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదోతరగతి + మెకానిక్ మోటార్ వెహికల్ విభాగంలో రెండేళ్ల ఐటీఐతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.
ఇతర ట్రేడ్స్‌మన్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ + సంబంధిత ట్రేడులో ప్రావీణ్యం కలిగి ఉండాలి.
పయనీర్ వింగ్ (మేసన్/ ఎలక్ట్రీషియన్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ + సంబంధిత ట్రేడులో ఏడాది అనుభవం ఉండాలి. సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయోపరిమితి: డ్రైవర్ పోస్టులకు 21 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి. కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టులకు 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 20.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: మే 19.
సెలెక్షన్ ప్రాసెస్: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ట్రేడ్/ స్కిల్‌టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)
అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలను ఇక్కడ తనిఖీ చేస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. వీటికి మార్కులు ఉండవు.
ఎత్తు: పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎస్టీ అభ్యర్థులకు, గిరిజన ప్రాంతాల వారికి నిబంధనల ప్రకారం మినహాయింపు ఉంటుంది.
ఛాతీ: పురుషులకు మాత్రమే. సాధారణ స్థితిలో కనీసం 80 సెం.మీ. ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. విస్తరించాలి.
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ)
ఈ పరీక్షలో అభ్యర్థులు నిర్ణీత సమయంలో పరుగు పందెం పూర్తిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న ట్రేడును బట్టి దూరం, సమయం మారుతుంటాయి.
గ్రూప్–ఏ (డ్రైవర్, మోటార్ మెకానిక్, గార్డెనర్, పెయింటర్, కార్పెంటర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, కోబ్లర్, టైలర్ & బుగ్లర్): పురుష అభ్యర్థులు 24 నిమిషాల్లో 5 కిలోమీటర్లు, మహిళలు 8.30 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి.
గ్రూప్–బీ (కుక్, వాటర్ క్యారియర్, వెయిటర్, బార్బర్, హెయిర్ డ్రెస్సర్, వాషర్‌మెన్, సఫాయి కర్మచారి): పురుష అభ్యర్థులు 10 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు, మహిళలు 12 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి.
గ్రూప్ –సీ (పయనీర్ వింగ్ – మేసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్): పురుష అభ్యర్థులు 9 నిమిషాల్లో 1.6 కిలోమీటర్లు పరుగెత్తాలి.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్crpf.gov.inను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
కంప్యూటర్ బేస్డ్ టెస్టులో ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. అంటే నాలుగు తప్పులకు ఒక మార్కు పోతుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. ప్రశ్నలు సాధారణంగా 10వ తరగతి స్థాయిలో ఉంటాయి.
విభాగం ప్రశ్నల సంఖ్య మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 25 25
జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 25 25
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 25
ఇంగ్లిష్ లేదా హిందీ (అభ్యర్థి ఎంపిక) 25 25