Reading Time: < 1 minute

1985 తెలంగాణ సామాజిక నేపథ్యంతో సర్కార్ బాయి..

Caption of Image.

శ్రీరామ్ నిమ్మల, సాయి కీర్తన  జంటగా  లారా దర్శకత్వంలో తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘సర్కార్ బాయి’.  సికింద్రాబాద్‌‌లోని గణేష్ టెంపులో    గురువారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అతిథిగా హాజరైన  ఇన్‌‌కమ్ ట్యాక్స్ అధికారి దాస్య నాయక్ ముహూర్తపు షాట్‌‌కు  క్లాప్ కొట్టి టీమ్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు. 

ఈ సందర్భంగా దర్శకుడు లారా మాట్లాడుతూ ‘1985 తెలంగాణ సామాజిక నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.  అప్పట్లో  జరిగిన నీటి సంఘటనలు, కుల వివక్షత వంటి అంశాలను ఆధారంగా తీసుకున్నాం’ అని అన్నాడు.   బాహుబలి ప్రభాకర్, నాగ మహేష్, దిల్ రమేష్, చలాకీ చంటి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

©️ VIL Media Pvt Ltd.