Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సిఎం రేవంత్ అని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, హరీశ్‌రావు వద్ద ఆధారాలు ఉంటే తీరుకురావాలని అన్నారు. నియోకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకమని స్సష్టం చేశారు. దక్షిణ భాతర్‌కు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు.