Reading Time: < 1 minute

జెరూసలేం: లెబనాన్‌తో నేరుగా చర్చలు ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్‌నెతన్యాహు ప్రకటించారు. వీలైనంత త్వరగా ఈ చర్చలు ప్రారంభించాలని కేబినెట్‌కు ఆదేశించినట్లు ఆయన కార్యాలయం వెల్లడించింది. లెబనాన్ ప్రభుత్వం పలుమార్లు నేరు గా చర్చలు ప్రారంభించాలని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్చలు ప్రధానంగా హిజ్బొల్లా మిలిటెంట్ల నిరాయుధీకరణ, అలాగే ఇజ్రాయెల్‌లెబనాన్ మధ్య శాం తి సంబంధాల ఏర్పాటుపై కేంద్రీకృతమవుతాయ ని తెలిపారు.

హిజ్బొల్లాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత లెబనాన్‌పై ఇజ్రాయెల్ చేపట్టిన అతిపెద్ద దాడుల్లో 200 మందికి పైగా మరణించిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రాం తంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ చర్చలు కీలకంగా మారనున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగం కావాలని ఇరాన్ పట్టుబడుతుండగా, అమెరికాఇజ్రాయెల్ మాత్రం లెబనాన్ ఈ ఒప్పందంలో భాగం కాదని స్పష్టం చేస్తున్నాయి.