Reading Time: < 1 minute

అమరావతి: కార‌ణం ఏదైనా మీడియా, ప‌త్రిక‌పై భౌతిక దాడులు స‌రైన నిర్ణయం కాదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. స‌మాజంలో అంద‌రూ ప‌త్రిక‌ల ప‌ట్ల గౌర‌వం పాటించాలని సూచించారు. అసత్య వార్తలు, అభ్యంతరకరమైన వార్తలు రాసినప్పుడు శాంతియుతంగా నిరసన చేప్టటాలని, కానీ చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రీ‌కాకుళం జిల్లా ఎచ్చెర్ల‌లో ఓ పత్రిక ఆఫీస్‌పై టిడిపి కార్యకర్తలు దాడి చేశారు. అక్కడే ఉన్న పత్రిక పేర్లకు సంబందించిన బోర్డులను పీకేసి తగల బెట్టారు.  ప్రహరీ గోడ దూకి ఎచ్చెర్ల ఓ పత్రిక యూనిట్ ఆఫీస్‌ ను తగలబెట్టారు.