Reading Time: < 1 minute

బుల్స్ జోరులో మన స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లను ముంచేసిన ఐటీ స్టాక్స్.. ఎందుకంటే?

Caption of Image.

గురువారం భారీ నష్టాలతో క్రోజ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం అనూహ్యంగా ఊపందుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రయాణాన్ని మెుదలు పెట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుల్స్ జోరుతో దూసుకుపోతున్నాయి. ఉదయం 10.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 870 పాయింట్ల లాభంతో ఉండగా మరో కీలక సూచీ నిఫ్టీ 257 పాయింట్లు పెరిగింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 1082 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 505 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.

ప్రధానం ఇవాళ మార్కెట్ ఇంట్రాడేలో ఫైనాన్షియల్, ఆటో, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన స్టాక్స్ లాభాల్లో ఉండటం మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. అయితే టీసీఎఫ్ ఫలితాల తర్వాత ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో ఐటీ స్టాక్స్ మార్కెట్లను కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నాయి. 

మెున్న ఇరాన్ అమెరికా మధ్య రెండు వారాల పాటు కుదిరిన కాల్పుల విరమణకు లెబనాన్ ఇజ్రాయెల్ ఇష్యూ అడ్డంకిగా మారటంతో మార్కెట్లోని ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తతోనే ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ స్వల్పంగా పెరిగి 97 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. అయితే హార్ముజ్ జలసంధికి చుట్టూ తిరుగుతున్న వివాదంలో క్రూడ్ ధరలు స్వల్పంగా పెరగటం పరిస్థితులు ఇంకా అసాధారణంగానే కొనసాగుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు అంటున్నారు. 

ఈ క్రమంలో మార్కెట్లో యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, ఇండిగో కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా నిలవగా.. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ స్టాక్స్ నష్టాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. 

©️ VIL Media Pvt Ltd.