
Mukul Chaudhary: నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తలపడ్డాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కోల్‌కతా నైట్ రైడర్స్‌పై మూడు వికెట్ల తేడాతో గెలిచింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక బరిలోకి దిగిన లక్నో జట్టులో ఓ 21 ఏళ్ల కుర్రాడు ముకుల్ చౌదరి హీరోగా నిలిచాడు. చివరి వరకు తీవ్ర ఒత్తిడితో సాగిన ఈ మ్యాచ్‌లో 27 బంతుల్లో అజేయంగా 54 పరుగులు చేసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఏడు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగాడు. ఇక ఆఖరి బంతి వరకు సాగిన ఈ మ్యాచ్‌లో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న ముకుల్, ఈ సందర్భంగా తన క్రికెట్ ప్రయాణంలోని కష్టాలను, ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు.
READ MORE: Dacoit Review: డెకాయిట్ రివ్యూ
తన తండ్రికి పెళ్లి కాకముందే తన కొడుకును గొప్ప క్రికెటర్‌గా చూడాలనే బలమైన కోరిక ఉండేదని గుర్తు చేశాడు. అయితే ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటంతో కొంత ఒడిదుడుకులు ఎదుర్కొన్నట్లు వెల్లడించాడు. రాజస్థాన్‌లోని ఝున్ఝును ప్రాంతానికి చెందిన ముకుల్, తన 12-13 ఏళ్ల వయసులో క్రికెట్ బ్యాట్ పట్టాడు. అయితే అక్కడ సరైన వసతులు లేకపోవడంతో జైపూర్‌కు మారి తన శిక్షణను కొనసాగించాడు. మారుతున్న టీ20 ఫార్మాట్‌కు అనుగుణంగా తన ఆటను మెరుగుపరుచుకోవడానికి గుర్గావ్‌లో కొన్ని నెలల పాటు కఠోర శ్రమ చేశానని అతను తెలిపాడు. ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదైన సమయంలో తను చేసిన పరుగులు చూసి, తన తండ్రికి తనపై పూర్తి నమ్మకం కలిగిందని ముకుల్ ఎమోషనల్ అయ్యాడు. “ఉత్తరప్రదేశ్‌తో జరిగిన అండర్-19 మ్యాచ్ నా కెరీర్‌ను మలుపు తిప్పింది. లో-స్కోరింగ్ మ్యాచ్ అయినప్పటికీ నేను కీలక పరుగులు చేశాను. నేను పెద్ద క్రికెటర్ అవుతానని నా తండ్రికి అప్పుడే నమ్మకం కలిగింది” అని ముకుల్ గుర్తుచేసుకున్నాడు.
READ MORE: Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?
ఇక ఒత్తిడితో ఒత్తిడితో కూడిన చివరి ఓవర్లలో ముకుల్ వ్యవహరించిన తీరు అమోఘం. ఒత్తిడిని భయంగా కాకుండా ఒక అవకాశంగా భావిస్తానని చెప్పే ఈ యువ ఆటగాడు, క్రీజులో చివరి వరకు నిలబడితే జట్టును గెలిపించగలననే నమ్మకంతో ఆడానని వివరించాడు. “ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటుంది. కానీ దేవుడు మనకు ఇచ్చిన అవకాశంగా దాన్ని భావిస్తాను. చివరి వరకు క్రీజులో ఉంటే జట్టును గెలిపించగలననే నమ్మకం నాకుంది. నా జోన్‌లోకి ఒక్క బంతి వచ్చినా సిక్సర్ కొట్టాలని ప్లాన్ చేసుకున్నాను. చిన్నప్పటి నుంచి బాదడమే నాకు తెలుసు” అంటూ తన పవర్ హిట్టింగ్ రహస్యాన్ని వెల్లడించాడు.