Reading Time: < 1 minute

నంబర్ ప్లేట్లు సరిగా లేని వాహనాలు సీజ్..

Caption of Image.

హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు మరోసారి తనిఖీలు చేపట్టారు. భవానీ నగర్, చార్మినార్, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని 11 ప్రాంతాల్లో  ఏప్రిల్ 9న రాత్రి భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ తనిఖీల్లో భాగంగా పోలీసులు పలువురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. గతంలో నేరాలు చేసి, పోలీసు రికార్డుల్లో ఉండి, కోర్టులకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

 నంబర్ ప్లేట్లు సరిగ్గా లేని , సరైన డాక్యుమెంట్స్ లేని పలు ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.

 తనిఖీల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన 10 బస్తాల పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టామని.. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.