
బెంగళూరు: భార్యతో నిద్రమాత్రలు మింగించి అనంతరం ప్రియురాలితో భర్త చాటింగ్ చేయడంతో పాటు వీడియో కాలింగ్ చేసేవాడు. ప్రశ్నించిన భార్యను హింసించిన సంఘటన కర్నాటక రాష్ట్రం హుబ్బళ్లిలోని విజయనగర ప్రాంతంలో జరిగింది. పది సంవత్సరాల క్రితం మాలింగప్ప అనే ఉపాధ్యాయుడు కాంచన అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. భార్యతో నిద్రమాత్రలు మింగించి అనంతరం తన ప్రియురాళ్లతో ఫోన్ లో ఛాటింగ్‌తో పాటు వీడియో కాల్ చేసేవాడు. రాత్రి సమయంలో భార్య గాఢ నిద్రలోనికి జారుకున్న తరువాత ప్రియురాళ్లను ఇంటికి తీసుకొచ్చి శృంగారం చేసేవాడు. భార్య పలుమార్లు ప్రశ్నించడంతో ఆమెపై దాడులు చేయడంతో పాటు బూతులు తిట్టేవాడు. ఆమె హుబ్బళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.