Reading Time: 2 minutes
Ai Nova 2 5g Ultra And Flip Launched Price Specifications And Features Are Here

Ai+ Nova 2 5G, Ultra, Flip Smartphones: Ai+ సంస్థ చెప్పినట్లుగానే కొత్తగా మూడు 5G స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Ai+ Nova 2 5G, Ai+ Nova 2 Ultra 5G, Ai+ Nova Flip 5G పేర్లతో ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునేలా పలు ఫీచర్లతో వచ్చాయి. మరి ఆ ఫోన్ లో ఆ ఫీచర్స్ ఉన్నాయి, వాటి ధర ఏంటో పూర్తి వివరాలు చూసేద్దామా..

Sunil Gavaskar: వైభవ్ సూర్యవంశీ సిక్సులు కొడుతుంటే చూడలేకపోయా.. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nova 2 5G:
Nova 2 5G గత ఏడాది వచ్చిన మోడల్‌కు సక్సెసర్‌గా వచ్చింది. ఇందులో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. Unisoc T8200 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6000mAh భారీ బ్యాటరీతో పాటు 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ ఫోన్ ధర రూ.8,999 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 14 నుంచి ఫ్లిప్కార్ట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ఇది అందుబాటులోకి రానుంది.

Image

Nova 2 Ultra 5G:
Nova 2 Ultra 5G మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో మంచి ఫోన్‌గా నిలుస్తోంది. ఇందులో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. MediaTek Dimensity 7400 ప్రాసెసర్, 50MP Sony IMX752 కెమెరా (OIS‌తో) ఈ ఫోన్ హైలైట్స్. ఇందులో గేమింగ్ కోసం ప్రత్యేక బటన్లు, VC కూలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు ఇందులో 6000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలదు. దీని ధర రూ.16,999 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 17 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Image (1)

Rashid Khan: వెన్ను గాయం వెంటాడుతోంది.. డాక్టర్లు హెచ్చరించారు.. అయినా కానీ..?

Nova Flip 5G: (ఫోల్డబుల్ స్టైల్‌)
Nova Flip 5G ఫోల్డబుల్ డిజైన్‌తో ప్రీమియం సెగ్మెంట్‌ లోకి అడుగుపెట్టింది. క్లామ్‌షెల్ స్టైల్‌లో వచ్చే ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల AMOLED మెయిన్ డిస్‌ప్లే, 3 అంగుళాల అవుటర్ స్క్రీన్ ఉన్నాయి. ఇక ఇందులో MediaTek Dimensity 7300X ప్రాసెసర్, 50MP కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాతో ప్రత్యేకంగా నిలుస్తోంది. కేవలం 7.2mm మందంతో స్లిమ్ డిజైన్, 4325mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ ఇందులోని కీలక ఫీచర్లు. ఈ ఫోన్ ధర రూ.49,999గా నిర్ణయించగా బ్యాంక్ ఆఫర్లతో రూ.29,999 వరకు తగ్గే అవకాశం ఉంది. ఇది మే 2026 నుంచి అందుబాటులోకి రానుంది.

Image (2)