
ది మోస్ట్ అవైటెడ్ అల్లు అర్జున్, అట్లీ సినిమా టైటిల్ వచ్చేసింది.. ఎవరూ ఊహించని విధంగా ఉన్న ఆ టైటిల్, ఆ లుక్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. మరి ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉంది..? మనిషి, మృగం కలిసినట్లున్న ఈ లుక్‌తో మేకర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు..? ఇందులో బన్నీ ఎన్ని అవతారాల్లో కనిపించబోతున్నారు..? రాకాపై స్పెషల్ స్టోరీ చూద్దామా..? సినిమా సినిమాకు తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నారు అల్లు అర్జున్. పుష్పతో తనలోని మాస్ యాంగిల్ పరిచయం చేసిన ఐకాన్ స్టార్.. రాకా కోసం ఏకంగా రాక్షసుడిగా మారిపోయారు. సినిమా కోసం మేకోవర్ అవ్వడంలో బన్నీ డెడికేషన్ పీక్స్. తాజాగా రాకాలో ఈ మృగరూపం దీనికి మరో నిదర్శనం. అట్లీ ఈ సినిమాకు రాకా అనే డిఫరెంట్ టైటిల్ అనౌన్స్ చేసి అందరి అంచనాలను తలకిందులు చేశారు. రాక్షసుడు అనే అర్థం వచ్చేలా డిజైన్ చేసిన ఈ పవర్ ఫుల్ టైటిల్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. బన్నీ కెరీర్‌లోనే ఇది నెవర్ బిఫోర్ లుక్.. దీనికోసం కొన్ని నెలలుగా తీరిక లేకుండా కష్టపడుతున్నారు ఐకాన్ స్టార్. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఉన్న మరో బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్ కూడా ఉంది. ఇందులో హీరో అలాగే విలన్ రెండు పాత్రల్లోనూ అల్లు అర్జునే కనిపించబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం మేకర్స్ వదిలిన ఈ లుక్ విలన్ రోల్ అంటున్నారు. ఈ లుక్ కోసం అట్లీ కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ఇక అసలైన విజువల్ ట్రీట్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. విలన్ పాత్రకే ఈ స్థాయిలో భయపెడుతున్న బన్నీ.. ఇక హీరో పాత్రలో ఎంత స్టైలిష్‌గా, స్వాగ్‌తో కనిపించబోతున్నారో అనే ఆసక్తి పెరిగిపోతోంది. హీరో లుక్ ఎప్పుడు వదులుతారా అని బన్నీ ఫ్యాన్స్ అంతా వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఇందులో దీపిక పదుకొనే మెయిన్ హీరోయిన్ కాగా.. మరో ముగ్గురు బ్యూటీస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Raaka: క్రూరుడు.. కత్తిలాంటి కుర్రాడు.. బన్నీ డ్యుయల్ రోల్
‘అటు మామ.. ఇటు బావ..’ అబ్బో.. ఖుషీగా బన్నీ
TOP 5 ET: ఆయనే ముందు ప్రపోజ్ చేశారు.. – అన్నా
Virat Kohli: ధురంధర్‌కి విరాట్ ఫిదా.. నీలాగే నేను కూడా అంటూ.. డైరెక్టర్ ట్వీట్