
హైదరాబాద్‌లో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీషీటర్లు ఎక్కువగా గంజాయికి అలవాటుపడడంతో వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 250 మంది రౌడీలకు డ్రగ్ టెస్టు చేయగా 190 మంది గంజాయి పాజిటివ్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో గంజాయి సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. హైదరాబాద్‌లో 1300 మందికిపైగా రౌడీషీట్ ఉన్నట్టు గుర్తించారు.