
జగన్ మావిగన్ జోకర్ అంటూ సంచలన ట్వీట్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల. ఏపీ రాజధాని అంశంపై ఇటీవల జగన్ చేసిన ప్రతిపాదనను ఎద్దేవా చేశారు షర్మిల. వైఎస్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తైన సందర్భంగా గురువారం ( ఏప్రిల్ 9 ) ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన షర్మిల జగన్ పై సెటైర్లు వేశారు. ఈ క్రమంలో షర్మిల కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇవ్వాళ్టికి 23 ఏళ్ళు… ఏప్రిల్ 9, 2003 లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర.. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకమని అన్నారు.
వైఎస్ వారసులం అని చెప్పుకునే జగన్ వైఎస్ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదని అన్నారు. వైసీపీలో నిజంగా వైఎస్సార్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయ్యి కూడా వైఎస్సార్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు షర్మిల. మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే, పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి “ఓన్లీ క్యాష్” మాఫియా ఎందుకు చేసారంటూ ప్రశ్నించారు.
#జోహార్ YSR#
ఇవ్వాళ్టికి 23 ఏళ్ళు. ఏప్రిల్ 9, 2003 లో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర.. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం. కాంగ్రెస్ నాయకుడు, నాన్న YSR ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల… pic.twitter.com/fiYCJiNG4j
— YS Sharmila (@realyssharmila) April 9, 2026
వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎలా మారారని.. వైఎస్ హయాంలో రాష్ట్రంలోనే ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారని.. దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై RSS వాదులు దాడులు చేస్తుంటే వైఎస్ వారసుడుగా జగన్ గారు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్ లు కట్టుకున్నారు. ఇప్పుడు “మావిగన్ జోకర్” గా మిగిలారని అన్నారు షర్మిల.