Reading Time: 2 minutes
అప్పట్లో ఊపేసిన నాగమ్మ సీరియల్‌.. నాగదేవతగా చేసిన అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇప్పుడు ఓటీటీలు వచ్చి టీవీలను డామిట్ చేస్తున్నాయి కానీ.. ఒకప్పుడు టీవీ సీరియల్స్ కు విపరీతమైన క్రేజ్ చేసుకున్నాయి. టీవీ సీరియల్స్ ఆడవాళ్లనే కాదు మగాళ్లను కూడా తెగ ఆకట్టుకునేవి.. సాయంత్రం అయితే చాలు ఇంటిల్లిపాది టీవీలకు అతుక్కుపోయి చూసేవారు. ఒకానొక సమయంలో సీరియల్స్ చాలా ఆసక్తికరంగా ఉండేవి. వాటిలో నాగమ్మ సీరియల్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. ప్రముఖ టీవీ చానెల్ జెమినీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసేవారు. ఇక ఇందులోని ‘ ‘పున్నమిలోన వెన్నల వాన చలువుదనలా చల్లని తల్లి నాగమ్మా…’ సాంగ్ వింటుంటనే భయం పుట్టేది. అయితే భయపడుతూనే నాగమ్మ సీరియల్ ను చూసేవారు. ఇప్పుడు సీరియల్స్ లో సీనియర్ ఆర్టిస్టులుగా నటిస్తున్న నీరజ, శ్రీనివాస్.. నాగమ్మ ధారావాహికతోనే గుర్తింపు తెచ్చుకున్నారు.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

శంకరాభరణం సోమయాజులు ఈ సీరియల్ లో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఇకపోతే ఇందులో బాల నాగమ్మగా ఛైల్డ్ ఆర్టిస్ట్ గాయత్రి నటించింది. చారడేసి కళ్లు.. నిండా కాటుక.. నుదుటిన పెద్ద బొట్టుతో అచ్చం దేవతలా దర్శనమిచ్చింది. అంతలా బాల నాగమ్మ పాత్రలో ఇమిడిపోయిన ఆ చిన్నారి పేర ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఆ చిన్నారి పేరు గాయత్రి. రాజమండ్రిలో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి తెలుగులో పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ కు బాగా చేరువైంది. అయితే నాగమ్మ సీరియల్ గాయత్రికి ఎనలేని క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ఈ సీరియల్ హిట్ కావడంతో ఆమెకు హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు ‘రాజీవ్’ హీరోగా నటించినటువంటి ‘నోట్ బుక్’ అనే చిత్రంతో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయమైంది. నోట్ బుక్ సినిమాలో అమాయకమైన అమ్మాయిగా గాయత్రి నటన మెప్పించింది. అయితే ఈ సినిమా తర్వాత అవకాశాలు వచ్చినప్పటికీ గాయత్రి పెద్దగా క్లిక్ అవ్వలేదు. నోట్ బుక్ సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించిన ఆమె ఆ తర్వాత గ్లామర్ డోస్ పెంచింది. మ్యీవ్, గంగపుత్రులు, వెయింట్ ఫర్ యు, అదే నీవు అదే నేను, గ్రీకు వీరుడు తదితర సినిమాల్లో వివిధ పాత్రలు పోషించింది. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీ బాట పట్టింది. అయితే అక్కడ కూడా సక్సెస్ కాలేదీ అందాల తార. ప్రస్తుతం ఈ నటి ఎక్కడుందో, ఏం చేస్తుందో తెలియలేదు. సోషల్ మీడియాలోనూ గాయత్రి పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ ఆమె ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

Gayatri

Gayatri

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.