
అమరావతి: పెళ్లికి ఒప్పుకోవడంలేదని ప్రియురాలి గొంతుకోసి ప్రియుడు చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీనివాస్ అనే యువకుడు, ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి అతడు తప్పించుకున్నాడు. వెంటనే స్థానికులు ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీశిలించిన వైద్యులు తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.