Reading Time: < 1 minute

హైదరాబాద్: అనుమతులు లేకుండా నడుపుతున్నారని రాఘవ కనస్ట్రక్షన్ కు అధికారులు నోటీసులు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి చేసింది తప్ప..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పింది తప్ప..తెలియాలని అన్నారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు శాఖల అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చారని, తమ కంపెనీకి మైన్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని, సిఎం తప్పు చెప్పారని మంత్రి పొంగులేటి ఎందుకు చెప్పలేదని హరీష్ రావు ప్రశ్నించారు. తమరు పొంగులేటి కాదని..పొంగులూటి అని ఎద్దేవా చేశారు. తమ మంత్రి కంపెనీలో జరిగిన అవినీతిని తమ అధికారులే గుర్తు పట్టారని అసెంబ్లీలో సిఎం చెప్పారని తెలియజేశారు. పేదల ఇళ్లపైకేనా హైడ్రా వెళ్తుందని, రెండున్నరేళ్లగా ఎందుకు భూమిని స్వాధీనం చేసుకోలేదని మండిపడ్డారు.  ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోకుండా హైడ్రా ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు.  పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు.