Reading Time: < 1 minute

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరాన్ని వినియోగంలోకి తేవాలని నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. రెండున్నరేళ్లు దారుణంగా వ్యవహరించి పంటలు ఎండబెట్టారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కమీషన్ల కోసమే ఇప్పుడు కాళేశ్వరానికి మరమ్మతులు అంటున్నారని, మున్సిపల్, అర్బన్ ఫారెస్ట్రీలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని కవిత విమర్శించారు. రూ.5 లక్షల లోపు విలువైన పనులే నామినేషన్ పద్ధతిలో ఇస్తారని, నామినేషన్ పద్ధతిలో ఇవ్వవద్దని కమిటీ నివేదిక ఇచ్చిందని తెలియజేశారు. రియల్ ఎస్టేట్ కోసం ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ కు నష్టం చేయవద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.