Reading Time: < 1 minute

కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్లపై ధరలు పెంచనున్నట్టు ప్రకటించింది. మే 2026 నుంచి అన్ని మోడళ్ల ధరలను 1 శాతం మేర పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. వివిధ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు జరుగుతోందని కంపెనీ పేర్కొంది. కార్లలో మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెరుగుదల మారుతూ ఉంటుంది. కొనుగోలుదారులపై భారం మోపాలనే ఉద్దేశం లేదని, ముడిసరుకుల ఖర్చులు నిరంతరం పెరుగుతున్నందున, స్వల్పంగా ధరలను పెంచాల్సిన అవసరం వచ్చిందని ఆటో మొబైల్ సంస్థ పేర్కొంది. 

 హ్యుందాయ్ కార్ల అమ్మకాలు 2026

హ్యుందాయ్ కార్ల అమ్మకాల విషయానికి వస్తే..ఇటీవలి నెలల్లో కంపెనీ బలమైన అమ్మకాలను చూసింది. 2025- 2026 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికంలో హ్యుందాయ్ మొత్తం 208,275 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల. 

హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే

హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడైన కారు విషయానికి వస్తే..హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.79 లక్షలు ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.20.19 లక్షల వరకు ఉంటుంది.