
రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఫ్లయింగ్ ఫ్లీ సి6’ను ఇండియా మార్కెట్లోకి తీసుకొచ్చింది. రూ. 2.79 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేసింది. విత్ బ్యాటరీ- యాజ్-ఎ-సర్వీస్ (BaaS)తో, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ. 1.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఫ్లయింగ్ ఫ్లీ C6 లో 15.4 kW (20 hp) PMSM ఎలక్ట్రిక్ మోటార్, 3.91 kWh బ్యాటరీ ప్యాక్ ఉన్నాయి.
ఈ మోటార్‌సైకిల్ కేవలం 3.7 సెకన్లలో 0 నుంచి 60 kmph స్పీడ్ అందుకోగలదు. గరిష్టంగా 115 kmph వేగంతో వెళుతుంది. దీనికి 154 కిలోమీటర్ల IDC రేంజ్ ఉన్నట్లు రాయల్ ఎన్ ఫీల్డ్ తెలిపింది. దీనిలోని ఆన్‌బోర్డ్ ఛార్జర్.. బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతానికి సుమారు 65 నిమిషాల్లో రీఛార్జ్ చేయగలదు.
ఆల్-LED లైటింగ్, గూగుల్ ఆధారిత ఆన్‌బోర్డ్ నావిగేషన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్, స్పోర్ట్, ఇండివిడ్యువల్ వంటి రైడ్ మోడ్‌లు ఉన్నాయి. ఇండివిడ్యువల్ మోడ్, ట్రాక్షన్ కంట్రోల్, ABS జోక్యం, మరియు థ్రాటిల్ రెస్పాన్స్‌ను రైడర్ తన ఇష్టానుసారం మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది.
మోటార్‌సైకిల్ ఏరోడైనమిక్స్, కూలింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన అల్యూమినియం కేసింగ్‌లో బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఈ డిజైన్ బైక్‌కు ఒక ఇంట్రస్టింగ్ లుక్ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్లన్నింటితో.. ఈ మోటార్‌సైకిల్ బరువు 124 కిలోలు. ఇప్పటిదాకా రాయల్ ఎన్‌ఫీల్డ్ తీసుకొచ్చిన బండ్లలో బరువు తక్కువగా ఈ మోడల్ నిలిచింది.