Reading Time: 2 minutes

అవినీతి బయటపడడంతో ఆత్మరక్షణలో పడ్డ మంత్రి పొంగులేటి

బూతులు, తిట్లు, పిట్టకథలు చెబుతున్నారని ఆగ్రహం

సిఎం సహా మంత్రులందరూ అవినీతిపరులే అని పొంగులేటి ఒప్పుకున్నారు

ప్రజలకు క్షమాపణ చెప్పాలి

వనపర్తి జిల్లాలో విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి: పొంగులేటి కాదు.. పొంగు లూటీ పొగరులేటి.. బాంబులూటీ అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్ గ్రామంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. అత్యంత పవిత్రమైన సచివాలయంలో పొగురులేటి మాటలు విన్నాం.. అంబేద్కర్, బిర్లా మందిరం, అమ్మవారు, మసీదు, చ ర్చి పక్కనే ఉన్నా నిజాలు దాచి అబద్ధాలు మా త్రమే మాట్లాడారని అన్నారు. ఆయన బూతు లు చూస్తే ఆయన ఫ్రస్ట్రేషన్ తెలుస్తుందని అన్నారు.

సరుకు లేనప్పుడు, సమాధానం లేనప్పు డు తిట్లు ఎత్తుకుంటారని, డిఫెన్స్‌లో పడ్డాడు పొగరులేటి అని, ఒక రాష్ట్ర మంత్రిగా కాకుం డా… రాఘవ కన్స్ట్రక్షన్ అధినేతగా మాట్లాడా రు. కొడుకును కాపాడుకునే ప్రయత్నం చేసి పిట్ట కబుర్లు చెప్పి బయటపడాలని అనుకున్నాడని తెలిపారు. నేనొక్కన్నె అవినీతి పరుడున్ని కాదు.. అందరూ మంత్రులు అవినీతి పరులే అని తేల్చారు.

జూపల్లి కృష్ణారావు, సీఎం, భట్టి సహా రాష్ట్రంలో అవినీతి కుంభకోణాల చిట్టా ఆయనే చదివారు. ఆయనతో పాటు అందరిని కలుపుకున్నాడని, పొంగులేటి కాదు.. పొంగులూటీ అని ఆయనే చెప్పకనే చెప్పిండు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు.. రాఘవ కన్స్ట్రక్షన్‌లో జరిగిన అవినీతి మా అధికారులే గుర్తు పట్టారు.. ఫైన్ కూడా కట్టారని సీఎం చెప్పారని తెలిపారు. అనుమతులు ఆలస్యం అవుతాయని మైనింగ్ మంత్రి చెప్పారని తెలిపారు. రెవెన్యూ ఎలక్ట్రిసిటీ పిసిబి మైనింగ్ నాలుగు శాఖల అధికారులు మైనింగ్ ఇన్స్పెక్షన్ చేసి ఇల్లీగల్ మైనింగ్ అని నిర్ధారించారు. పొంగులేటి చెప్పింది తప్పా…అధికారులు చెప్పింది తప్పా.. ముఖ్యమంత్రి చెప్పింది తప్పా? మైనింగ్ మంత్రి చెప్పింది తప్పా? నువ్వేమో సంబంధం లేదని చెప్తున్నావ్.. పొగరులేటి నీవి ఇంకా చాలా ఉన్నాయి.. అన్ని బయటపెడతామని తెలిపారు. పొగరు తగ్గించుకో పొంగులేటి రాఘవ కు మైనింగ్ లేదని ఎందుకు చెప్పలేదని, అసెంబ్లీ లో ఉండి కూడా నాది కాదని చెప్పలేదని ఆరోపించారు.

సీఎం మైనింగ్ మంత్రి తప్పు అని చెప్పని, కంటైనర్ మీద రాఘవ కన్స్ట్రక్షన్ పేరు ఎందుకు ఉంది.. కాంగ్రెస్ జెండా ఎందుకు ఉంది? పిసిబి, మైనింగ్ అధికారులు నోటీస్ ఇస్తే మీ ఉద్యోగి రిసీవ్ చేసుకున్న కాపీ నేను అసెంబ్లీలో చూపెట్టానని తెలిపారు. బాంబులేటి బుకాయిస్తున్నావ్..వాస్తవాలు అసెంబ్లీ లో ఎందుకు చెప్పలేదని తెలిపారు. నాదార్ గుల్ భూములు కాపాడింది బీ ఆర్‌ఎస్ పార్టీ.. నిషేధిత భూముల జాబితాలో పెట్టింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమని తెలిపారు. హై కోర్ట్ లో కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొట్లాడిందని, సీలింగ్ భూములు అమ్మినవారి మీద.. కొన్న వారి మీద చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్ తెచ్చింది బీఆర్‌ఎస్ అని తెలిపారు. ఎందుకు దాచి పెడుతున్నావని, డివిజన్ బెంచ్‌లో కేసు గెలిచింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా, మీరు చెప్పినట్లు నేడు అవి ప్రభుత్వ భూములు అయితే రోజుకొక పేరు ఎందుకు మారుతుందని తెలిపారు.

రెండున్నర ఏండ్లుగా భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదని తెలిపారు. ఎందుకు కంపెనీల బోర్డులు మారుతున్నాయి? శిల్పతో రాఘవ కంపెనీకి సంబంధాలు ఉన్నాయా లేవా? ఏ క్యూ స్క్వేయిర్ తో సంబంధాలు ఉన్నాయి నిజామా కాదా? మీరు అన్నట్లు ప్రభుత్వ భూములు అయితే హైడ్రా గడ్డి పీకుతుందా అని తెలిపారు. ఆర్డీవో ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ల్యాండ్ అని ఆర్డర్ ఉండగా హైడ్రా ఎందుకు కండ్లు మూసుకుందని తెలిపారు. నిజాయతీ ఉంటే, చిత్తశుద్ధి అక్రమణదారులపై చర్యలు తీసుకోండని తెలిపారు. పొంగులూటి పొగరులేటి నీ బాంబులు అన్ని తుస్సుమన్నాయని తెలిపారు. నీ విషయాలు చాలా ఉన్నాయి. ఇంకా ఏం కాలేదని తెలిపారు. హైడ్రాను పంపి చిత్తశుద్ధి నిరూపించుకో తప్పు అయితే నాలుగు శాఖల మీద చర్యలు అయినా తీసుకో అని తెలిపారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ లో అబద్దం ఆడారు అని చెప్పించు, పొగరు లేటి నువ్వు బాంబు లూటీ ఇప్పటికైనా తప్పు ఒప్పుకో ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.