Reading Time: < 1 minute

అమరావతి: న్యాయం అడిగితే తన భర్తను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని రామాంజనేయులు భార్య జోత్స్య ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం అడిగినందుకే తన భర్త చిత్రహింసలు పెట్టడంతో పాటు మనోవేదనకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. తన భర్తపై ఐదు కేసులు నమోదు చేశారని, 307 కేసు పెట్టి 100 రోజులు జైల్లో ఉంచారని ఆరోపించారు. అయినా పోరాటం కొనసాగిస్తుండటంతో తన భరపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేశారని తెలియజేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు.

ఓ ప్రజాప్రతినిధి పిఎ సాంబశివరావు తన కుటుంబాన్ని వ‌దిలేయాలని రామాంజనేయులు కోరారు. డిఎస్ పి మురళీ కృష్ణ తన కుటుంబాన్ని వదిలేసి తనన ఎన్‌కౌంట‌ర్ చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గం యర్రబాలెంలో రామాంజనేయులు అనే వ్యక్తి సెల్ ఫోన్ టవర్ ఎక్కి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డాడు. తన మరణానికి మంగళగిరి సిఐ వీరస్వామి, డీఎస్పీ మురళీకృష్ణ అని, తనపై తప్పుడు కేసులు కట్టి వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఓ ప్రజా ప్రతినిధి పిఎ సాంబశివరావు, మ‌రికొంత‌మంది చెప్పార‌ని త‌న‌పై రౌడీషీట్ ఓపెన్ చేసి వేధిస్తున్నార‌ని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. తాను ఇక ఇబ్బందులు ప‌డ‌లేనని, తనని ఎన్ కౌంట‌ర్ చేయాలని కోరారు. తాను టిడిపి కార్యకర్తను అని, ఒక సాంభశివ రావుతోనే అన్యాయం జరిగింది, మొత్తం వ్యవస్థను తప్పు పట్టడంలేదన్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.