
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. గురువారం ( ఏప్రిల్ 9 ) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. చెదురుముదురు ఘటనలు మినహా మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మూడు రాష్ట్రాల్లో మొత్తం 296 సీట్లకు జరిగిన ఈ ఎన్నికల్లో 5.24 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పోలింగ్ శాతం ఇలా:
- అస్సాంలో 84.42 శాతం
- కేరళలో 75శాతం
- పుదుచ్చేరిలో 86.92 శాతం పోలింగ్ నమోదయ్యింది.
మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మే 4న అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.